వెంకన్న సన్నిధిలో 'మంచు' అక్కాతమ్ముళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న సన్నిధిలో ‘మంచు’ అక్కాతమ్ముళ్లు

October 30, 2020

Manchu vishnu and lakshmi prasanna visited ttd

సినీ నటులు, టాలీవుడ్ అక్కాతమ్ముళ్ళు మంచు విష్ణు, మంచు లక్ష్మి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వెంకన్న సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. 

ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుపతిలో మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని, మోసగాళ్ళు సినిమా త్వరలోనే విడుదల కానుందని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు. మోసగాళ్ళు సినిమా విడుదల సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు పొందమన్నారు. త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. వీరు తిరుమలలో దిగిన ఫోటోను మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.