Manchu Vishnu angry over Vennela Kishore's birthday wishes
mictv telugu

నీకు చాలా పొగరు – వెన్నెల కిషోర్ విషెష్ పై మంచు విష్ణు ఫైర్

November 24, 2022

మంచు విష్ణు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న కమెడియన్ వెన్నెల కిషోర్. ఇటీవల విష్ణు నటించిన జిన్నా సినిమాలో వీరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది. అంతకుముందు చిత్ర ప్రమోషన్ సమయంలో వెన్నెల కిషోర్ ని మంచు విష్ణు ఓ రేంజ్ లో వాడేశారు. కిషోర్ ని తిట్టిన తిట్లు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మంచు విష్ణు మరోసారి వెన్నెల కిషోర్ ని ఉద్దేశించి ‘నీకు చాలా పొగరు’ అని ట్వీట్ చేశారు. వివరాల్లోకెళితే.. మంచువిష్ణు బుధవారం తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులున సోషల్ మీడియా ద్వారా ఆయనకు విష్ చేశారు.

 

తమ్ముడు మంచు మనోజ్ జారు మిఠాయి సాంగ్ పాడిన సింగర్ తో అన్నయ్యకి బర్త్ డే విషెష్ చెప్పారు. సోదరి లక్ష్మీ మంచు తనదైన శైలితో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే వెన్నెల కిషోర్ కాస్త ఆలస్యంగా స్పందించిన అభినందనలు తెలిపారు. డైనమిక్ హీరో విష్ణు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ట్వీట్ చేశారు. దానికి విష్ణు రియాక్ట్ అవుతూ ‘ముందు విషెష్ చెప్పాలని తెలీదా? నీకు చాలా పొగరు’ అని రీట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. నీకు విషెష్ చెప్పడమే ఎక్కువా? ఇంకా త్వరగా విష్ చేయలేదని చెప్తావా? అంటూ పరువు తీస్తున్నారు.

ఇది కూడా చదవండి : అంతటా అవమానాలు.. అక్కడ మాత్రం సంచలనాలు