టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మంచు విష్ణు, విరానికా రెడ్డిల జోడి ఒకటి. 15 ఏళ్ళ క్రితం వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నారు. వీరి అనుబంధానికి గుర్తుగా నలుగురు పిల్లలు ఉన్నారు. కవలలు అరియానా, వివియానా కాగా, చిన్నపాప ఐరా విద్య, కుమారుడు అవ్రామ్ భక్త. పిల్లలకు సంబంధించిన విశేషాలను మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు. మార్చి 1న విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి రోజు. ఈ ఆనంద సమయాన్ని కుటుంబంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు.
పెళ్లిరోజు సందర్భంగా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా తల్లిదండ్రులకు ఊహించని బహుమతి ఇచ్చారు. అదిరిపోయే ఆల్భమ్‌ను క్రియేట్ చేసి పేరెంట్స్‌ను సర్ప్రైజ్ చేశారు. ఇది చూసిన విష్ణుకు కళ్లంట నీరు వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు
అరియానా, వివియానా రూపొందించానా ఆల్భమ్‌లో విష్ణు, విరానికాకు సంబంధించిన పలు స్పెషల్ మూమెంట్స్ ను పొందుపర్చారు. పెళ్లి ఫోటోలతో పాత జ్ఞాపకాలను జత చేశారు. ‘మై ఫాదర్ లవ్స్ మై మామ్’ అంటూ ఓ పాట పాడుతూ దానికి స్పెషల్ ఫోటోలు యాడ్ చేశారు. ఈ పాట చూసి మంచు విష్ణు కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఈ సాంగ్ కంప్లీట్ అయ్యే సరికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ డార్లింగ్స్. మీరు ఇచ్చిన ఈ సర్ ప్రైజ్‌ను నేను ఏనాడు మర్చిపోను” అంటూ ట్వీట్ చేశారు.
I started crying towards the end of the song. Thank you my darling #Ariaana #Viviana, my little mommies ❤️❤️❤️❤️❤️. This has made my day and I will never forget this surprise gift for @vinimanchu and me. pic.twitter.com/RZI13tazny
— Vishnu Manchu (@iVishnuManchu) March 1, 2023
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరియానా, వివియానా పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంచు విష్ణు జిన్నా సినిమాలో ఫ్రెండ్ షిప్ పాట పాడి అదరగొట్టిన ఈ అక్కాచెల్లెళ్లు మరోసారి తమ ప్రతిభను లోకానికి పరియం చేశారు.
ఇవి కూడా చదవండి
Sushmita Sen :సుస్మితా సేన్‌కు గుండెపోటు
బాలీవుడ్ ఆఫర్ కు నో చెప్పిన పుష్పరాజ్