Manchu Vishnu Jinnah movie releasing in Amazon Prime on December 2
mictv telugu

ఓటీటీలోకి మంచు విష్ణు జిన్నా.. రెండు భాషల్లో అందుబాటులోకి

December 1, 2022

మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం జిన్నా. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇప్పుడు జిన్నా మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. డిసెంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే మలయాళం, తెలుగు భాషల్లో మాత్రమే విడుదలవుతుండగా, హిందీ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటించగా, షార్ట్ కట్ లో జిన్నా అని పిలుచుకుంటారు. భారీగా అప్పులున్న జిన్నా.. వాటిని టెంట్ హౌస్ పెట్టి ఎలా తీర్చాడన్నది కథ.