manchu vishnu kissing heroine photos caught by his wife viranica reddy
mictv telugu

ముద్దుల ఫోటోలు లీక్.. భార్యకి దొరికిపోయిన మంచు విష్ణు

October 22, 2022

చేసే పనులు మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి.. విజయాలకు సక్సెస్ సీక్రెట్ ఇదే. ఈ లెక్కల్లో ఏ మాత్రం తేడా కొట్టినా పరిస్థితులు తారుమారు అవుతాయి. మంచు విష్ణు విషయంలో ఇది వర్తిస్తుంది అంటుంటారు సినీ క్రిటిక్స్. అనవసర గొప్పలు చెప్పుకోవటం, నోరు జారటం వంటి విషయాల్లో తరచుగా ట్రోలర్స్‌కి కంటెంట్ ఇచ్చే మంచు విష్ణు తాజాగా మరో విషయంలో దొరికిపోయాడు.

ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒక హీరోయిన్‌తో ముద్దులు పెట్టుకునే ఫొటోలని తన భార్య చూసేసిందని.. ఆ ఫోటోలు తన ఫోన్‌లోనే పెట్టుకున్నానని, అవి చూసిన తన భార్య సీరియస్ అయినట్టు వెల్లడించాడు విష్ణు. అయితే అమ్మాయిలపై కాస్త బోల్డ్ కామెంట్స్ చేయటం మంచు విష్ణుకి అలవాటే. తనకి అమ్మాయిలంటే ఇష్టమని, అందరితో నాటీగా ఉంటానని మంచు విష్ణు ఓపెన్ కామెంట్స్ చేశాడు. అయితే ఇలా ముద్దులు కూడా పెడతాడా అని జనాలు షాక్ అవుతున్నారు.

జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాతో విష్ణు మాట్లాడుతూ.. ‘నాకు పాత ఫోటోలను గ్యాలరీలో పెట్టుకోవటం అలవాటు. అవన్నీ స్వీట్ మెమొరీస్‌గా పెట్టుకుంటా. అలా 2014లో నెను ఒక హీరోయిన్‌తో ముద్దుపెట్టుకున్న ఫోటో నా ఫోన్‌లో సేవ్ చేసుకున్న. అయితే అది ఇటీవల నా భార్య విన్నీ చూసింది. ఎవరా అమ్మాయి అంటూ దబాయించింది. అది 2014లో దిగిన ఫోటో ఇప్పుడెందుకు ఇష్యు చేస్తున్నావ్ లైట్ తీసుకో అని అన్నాను. అప్పుడు నా భార్య ఆఫొటోలని నాన్నకి చూపిస్త అని బెదిరించింది. దెబ్బకు నేను దండం పెట్టి అది మాత్రం చేయకు తల్లి అని బతిమిలాడాను. అయినా నేను అందరి అమ్మాయిలను ముద్దుపెట్టొకొవటం నాకు అలవాటు’ అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో అమ్మాయిలు దొరికితే కడుపు చేయాలన్న బాలకృష్ణ కామెంట్లలా.. మంచు విష్ణు ముద్దుల కామెంట్స్ కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఏదేమైనా మంచువిష్ణు మరోసారి ట్రోలర్స్ కి కంటెంట్ ఇచ్చేశాడనే చెప్పాలి.