Home > Featured > జిన్నా పోయినా.. జాక్ పాట్ కొట్టిన మంచు విష్ణు.. ఇక నో ట్రోల్స్..!

జిన్నా పోయినా.. జాక్ పాట్ కొట్టిన మంచు విష్ణు.. ఇక నో ట్రోల్స్..!

ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ అంటూ మంచు విష్ణు తపించబట్టి కొన్నేళ్లు అవుతుంది. కెరీర్ మొదట్లో 'ఢీ' అనే ఒకే హిట్ సినిమాతో కెరీర్ ని ఇన్నాళ్లు లాక్కోచ్చేసాడు విష్ణు. తండ్రి పేరు, డబ్బులతో ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా సినిమాలు చేసాడు. అయితే మంచు వారసుల్లో ఎవరు కూడా పెద్దగా సక్సెస్ కాలేరని అంటారు. మంచు మనోజ్ కి ట్యాలెంట్ ఉన్నా సరైన సినిమా పడలేదని, ఇక మంచు లక్ష్మికి ఇదే పరిస్థితి అంటుంటారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు లేనంత హైప్ తో మంచు విష్ణు జిన్నా మూవీ విడుదలైంది. పర్వాలేదు అని మొదటి రోజు టాక్ వచ్చినా కలెక్షన్స్ లో మాత్రం డిజాస్టర్ అయిపోయింది జిన్నా. 4కోట్ల బిజినెస్ జరిగినా.. 80 లక్షలు కూడా వసూల్ చేయలేక చతికిలపడింది. దాంతో మంచు విష్ణుకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ ఫ్లాప్ కి తోడు మరోవైపు సోషల్ మీడియా ట్రోలింగ్ ఉండనే ఉంది.

జిన్నా పబ్లిక్ టాక్, మీడియా డిస్కర్షన్స్, ప్రమోషన్స్ లో విష్ణు మంచు మాట్లాడిన మాటలని మీమ్స్ చేసి తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతటి బ్యాడ్ టైం లో కూడా మంచు విష్ణుకి అద్దిరిపోయే జాక్ పాట్ ఒకటి తగలనున్నట్టు సమాచారం. అదే ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాతో సినిమా. గతకొన్నేళ్ళుగా బాలీవుడ్ లో సరైన హిట్ లేని ప్రభుదేవా.. సౌత్ లో తక్కువ బడ్జెట్ సినిమా తీయాలని అనుకుంటున్నారట. దీనికోసం కథ కూడా సిద్ధం చేశాడట. అయితే ఈ కథకి మంచు విష్ణు అయితే బెటర్ అని అనుకుంటున్నాడట ప్రభుదేవా. జిన్నాకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాంగ్ కొరియోగ్రఫీ చేశాడు ప్రభుదేవా. ఈ సాన్నిహిత్యంతోనే మంచు విష్ణు కూడా చాలా రోజుల నుండి తనతో సినిమా చేయాలని ప్రభుదేవాని అడుగుతున్నాడట. దీంతో విష్ణుకి ప్రభుదేవా కమిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు క్రిటిక్స్

Updated : 4 Nov 2022 2:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top