Manchu Vishnu Serious On Vishwak Sen Over Hero Arjun Compliant
mictv telugu

యాటిట్యూడ్ చూపిస్తే తోకలు కత్తిరిస్తా .. విశ్వక్ సేన్ పై మంచు విష్ణు సీరియస్

November 7, 2022

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. సొంత కష్టంతో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్. తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఇదే యాటిట్యూడ్ ఇప్పుడు విశ్వక్ కి చిక్కులు తెచ్చి పెడుతుంది అంటున్నారు. తమిళ స్టార్ హీరో అర్జున్ తో విశ్వక్ వివాదం తారాస్థాయికి చేరుతుంది. అర్జున్ కుమార్తెతో విశ్వక్ సేన్ సినిమా కమిట్ అయ్యాడు. ప్రి ప్రొడక్షన్ వర్క్, అగ్రిమెంట్స్ అన్ని అయ్యాకా.. తీరా ‘షూటింగ్ కి నేను రాలేను’ అంటూ అర్జున్ కి షాక్ ఇచ్చాడు విశ్వక్. ఒక్క మెసేజ్ పెట్టి సినిమా నుండి తప్పుకున్న విశ్వక్ ఉదంతాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి సీనియర్ హీరో అర్జున్ ఖండించాడు. అయితే ఇండస్ట్రీలో హీరో అర్జున్ వివాదరహితుడు అన్న మంచి పేరుంది. తెలుగు, తమిళం, కన్నడ వంటి అన్ని భాషల్లో గొప్ప గొప్ప సినిమాలు చేసిన అర్జున్ తొలిసారి ఇలా బహిరంగంగా ఒక నటుడిని విమర్శించటం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.

అర్జున్ హీరో మాత్రమే కాదు.. కథకుడు, దర్శకుడు మరియు నిర్మాతగానూ ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి.
ఇంత సూదీర్గ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క మచ్చ కూడా లేదు. ఇక్కడే అందరు అర్జున్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక సీనియర్ హీరో, అందులోను క్రెడిబిలిటీ ఉన్న హీరో అర్జున్ స్వయంగా బాధతో విమర్శిస్తున్నాడంటే.. వేళ్లన్ని విశ్వక్ వైపు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా హీరో అర్జున్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకి విశ్వక్ పై ఫిర్యాదు కూడా చేశాడు. అర్దాంతరంగా తన సినిమా నుండి తప్పుకున్నాడని, అగ్రిమెంట్ లోని రూల్స్ ఉల్లంఘించాడని, తనకి న్యాయం చేయాలనీ విష్ణుని కోరాడు అర్జున్. దీంతో అన్ని విషయాలు విన్నాకా… విశ్వక్ పై విష్ణు కాస్త సీరియస్ అయ్యాడని అంటున్నారు. మీలాంటి సీనియర్ హీరోని ఇంతలా ఇబ్బంది పెట్టిన విశ్వక్ ని వెంటనే వివరణ అడుగుతానని.. ఎవ్వరైనా ఎంతటి వారైనా సీనియర్స్ కి మర్యాద ఇవ్వాల్సిందేనని, యాటిట్యూడ్ చూపిస్తే తోకలు కత్తిరిస్తా అని మంచు విష్ణు అన్నాడని టాక్. ఇక త్వరలో విశ్వక్ ని పిలిపించి పంచాయితీ సెట్ చేస్తానాని అర్జున్ కి విష్ణు మాట ఇచ్చినట్టు సమాచారం.