Manchu Vishnu Trolled by netizens by Tweets On Hero Nikhil’s Movie Karthikeya 2
mictv telugu

నిఖిల్‌కు మంచు విష్ణు భరోసా.. నీకే దిక్కు లేదంటూ నెటిజన్ల ట్రోలింగ్

August 2, 2022

 

కార్తికేయ 2 మూవీ విషయంలో తనకు ఎదురవుతున్న అనుభవాల గురించి బాధపడ్డాడు హీరో నిఖిల్. తనకు థియేటర్లు దొరకడం లేవని, సినీ ఇండస్ట్రీలోని రాజకీయాలతో తాను విసిగిపోయానంటూ బాదపడ్డాడు. ‘కార్తికేయ 2’ను ఆగస్టు 12న విడుదల చేద్దామనుకోగా కొందరు ఆ రోజు కూడా వద్దన్నారని, అక్టోబరులోనో, నవంబరులోనో రిలీజ్‌ చేస్కోమని చెప్పారన్నాడు. ఇప్పుడప్పుడే మీ సినిమా విడుదల కాదు, మీకు థియేటర్లు ఇవ్వమని మాట్లాడారని, ఆ సమయంలో ఏడ్చానంటూ బాధపడ్డాడు

ఇక ఈ విషయంలో నిఖిల్‌కు జనాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఓ ట్వీట్ వేశాడు. నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. ధైర్యంగా ఉండాలని చెబుతూ.. మంచి కంటెంట్‌ ఎప్పుడూ విజయం సాధిస్తుందని చెప్పారడు . కార్తీకేయ 2 చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఇక ఈ ట్వీట్‌కు నిఖిల్ ఉప్పొంగిపోయాడు. విష్ణు భాయ్ నీ మాటలు మా టీంకు కొండంత అండను ఇస్తున్నాయ్ అని నిఖిల్ రిప్లై ఇచ్చాడు.

ఇక ఈ విషయం మీదే మంచు విష్ణుని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. నీకే దిక్కు లేదు నువ్ వస్తావా? అని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. నీకు చెప్పడమే కానీ.. చెయ్యడం చేతకాదని అంటున్నారు. సన్ ఆఫ్ ఇండియా 2 అప్డేట్ ఎప్పుడు.. సన్ ఆఫ్ ఇండియా రికార్డులను కార్తికేయ 2 బ్రేక్ చేయాలి.. అంటూ ఇలా పలు రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక కొందరు అయితే ముందు మా బిల్డింగ్ సంగతి ఏమైందో చెప్పు అంటూ నిలదీస్తున్నారు. అలా మంచు విష్ణు ఇప్పుడు మరోసారి నెట్టింట్లో చర్చను లేవనెత్తాడు.