బురఖాలో ‘అశ్లీల’ డ్యాన్స్.. మందన కరీమీపై తిట్ల వర్షం
బురఖాపై అంతులేని వివాదాలు సాగుతున్న నేపథ్యంలో ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి మందనా కరీమీ కొత్త గొడవ తెచ్చిపెట్టింది. ఒంటి నిండా బురఖా వేసుకుని నడుపు తిప్పుతూ నృత్యం చేసింది. చాలా అశ్లీలంగా డ్యాన్స్ చేసి, ముస్లింల పరువు తీసిందని ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్‌కు చెందిన మందన మనదేశంలో మోడల్‌గా నటిగా రాణిస్తోంది. మన దేశానికే చెందిన గౌరవ్ గుప్తాను పెళ్లి చేసుకుని విడిపోయింది.
ఆమె ఇటీవల బురఖా ధరించి ఓ బట్టల కొట్టుకు వెళ్లింది. ఏమైందో ఏమోగాని సంబంరం తట్టుకోలేక నడుము, తొడలు తిప్పుతూ డ్యాన్స్ చేసింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పడేసింది. పనికిమాలిన డ్యాన్స్ చేసి బురఖా పరువు తీసింది పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు ఆమెకు మద్దతు పలుకుతూ.. చూసే చూపును బట్టి ఉంటుందని, వస్త్రాలకు పవిత్రత, అపవిత్రత ఆపాదించవద్దని అంటున్నారు.