ఆధార్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్.. అప్డేట్ చేసుకోవాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్.. అప్డేట్ చేసుకోవాల్సిందే..

November 11, 2022

Mandatory to update Aadhaar at least once in 10 years, says Centre

 

మీరు ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరునామా, ఇతర వివరాలను అప్‌డేట్‌ చేయలేదా? అయితే.. మీరు వెంటనే ఆయా ఆధారాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్‌ జారీ చేసింది. ఆధార్ పొందిన 10 సంవత్సరాలు తర్వాత కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది.

గతేడాది 16 కోట్లు మంది ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకున్నారు. దేశంలో ఆధార్ కలిగి ఉన్నవారు 134 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఇంకా అప్డేట్ చేస్కోవాల్సి ఉందన్న విషయంపై స్పష్టత లేదు. పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు ఈ ప్రక్రియను నేరుగా ఆధార్‌ పోర్టల్‌ లేదా ‘మై ఆధార్‌’ యాప్‌లో పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ సేవలు అందుబాటులో లేనివారు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను సందర్శించి, డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొంది.