Mandira Bedi returns to cricket with THIS IPL team
mictv telugu

మందిరా బేడీ మరోసారి క్రికెట్ హోస్ట్ చేయనుంది!

January 5, 2023

రాజస్థాన్ రాయల్స్, రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ యాజమాన్యంలోని ఫ్రాంచైజీ, కలర్స్ రిజిస్ట్రేషన్ భాగస్వామి క్రిక్ హీరోస్ తో కలిసి సరికొత్త క్రికెట్ రియాలిటీ ప్రోగ్రామ్ మొదలుపెట్టబోతున్నది. క్రికెట్ కా టిక్కెట్ పేరుతో వచ్చే ఈ ప్రోగ్రామ్ కి మందిరా బేడీ కనిపించనుంది.
సుప్రసిద్ధ టెలివిజన్ క్రికెట్ ప్రజెంటర్ మందిరా బేడీ క్రికెట్ బ్రాడ్ కాస్టింగ్ లో అగ్రగామి. ప్రపంచంలోని తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతల్లో ఆమె ఒకరు. ఆమె ఇప్పుడు క్రికెట్ ట్యాలెంట్ ని వెతికి పట్టుకునే పనిలో ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది క్రికెట్ కెరీర్ గా మార్చుకోవాలని అనుకొని ఉంటారు. కానీ వారికి సరైన ప్లాట్ ఫామ్ దొరక్కపోయి ఉండొచ్చు. ఇప్పుడు దీని ద్వారా అది తీరిపోనుంది.

ఆడా.. మగా తేడా లేకుండా..
‘క్రికెట్ కా టికెట్’.. ఇది క్రికెట్ కోసం జరిగే పెద్ద హంట్. ఇందులో ఆడవాళ్లు, మగవాళ్లు కూడా పాల్గొనొచ్చు. ఇద్దరికీ సమానంగా ఛాన్స్ ఇస్తారు. క్రికెట్ కెరీర్గా కావాలనుకున్నవాళ్లు ఈ హంట్ కి అప్లికేషన్ ఇవ్వొచ్చు. ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒక యూనిక్ షోకి హోస్ట్ గా చేయడం నాకు మంచి ఛాన్స్. క్రికెట్ క్రేజీ వ్యూయర్స్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ లభించబోతున్నది’ అంటూ రాసుకొచ్చింది.

రివార్డు కూడా..
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక పురుషుడు, స్త్రీ విజేతకు ఒక్కొక్కరికి 5 లక్షల బహుమతి అందుతుంది. అలాగే రాయల్స్ కోచ్ లు, మెంటర్స్, ఆటగాళ్ల నుంచి మెంటర్షిప్, కోచింగ్ సపోర్ట్ కూడా సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తారు. పురుషుల విభాగంలో గెలిచిన వారికి ఒకసారి జీవితకాలంలో రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అదే మహిళలకు అయితే దేశవాళీ టీ 20 లో ట్రయల్ అవకాశాలను పొందొచ్చు.