ఏనుగు హత్య, మంత్రి రాజీనామా చేయాలి.. మేనకా గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగు హత్య, మంత్రి రాజీనామా చేయాలి.. మేనకా గాంధీ

June 3, 2020

ealepant

కేరళలో జరిగిన ఏనుగు హత్యపై దూమారం రేగుతోంది. మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పైనాపిల్ బాణాసంచాతో ఏనుగును చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జంతు ప్రేమికురాలు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మండిపడ్డారు. మలప్పురం జరిగిన ఘటనపై కేరళ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె నిప్పులు చెరిగారు. తక్షణ చర్యలు తీసుకోడానికి పినరయ్ సర్కార్ జంకుతోందని అన్నారు. 

ఏనుగు సంఘటన హత్యే. మలప్పురం ముందు నుంచీ ఇలాంటి దుశ్చర్యలకు చాలా ప్రఖ్యాతిగాంచింది. అత్యంత హింసాత్మక జిల్లాగా దేశంలోనే పేరు గడించింది. రోడ్లపై విషాన్ని చల్లేస్తారు. దీంతో ఒక్కసారే మూడు వందల నుంచి నాలుగు వందల కుక్కలు మరణించాయి. ఇప్పుడు కేవలం 20,000 ఏనుగులు మాత్రమే మన దేశంలో మిగిలి ఉన్నాయి. అవి కూడా నెమ్మదిగా అంతమైపోతున్నాయిఅని మేనకా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

ఈ మేరకు కేరళ అటవీ శాఖ కార్యదర్శి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే అటవీ శాఖామంత్రికి ఏ మాత్రం బుద్ధి ఉన్నా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆమె తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాహుల్ అదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ అయివుండి, ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? అని మేనకా గాంధీ ప్రశ్నించారు.