గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత నోటీసులు రావడం ఇది రెండో సారి కాగా, 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై ఆగస్టు 2022లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అప్పుడే కంచన్ బాగ్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది.
అయితే ఈ కేసు మంగళ్ హాట్ స్టేషనుకు బదిలీ కావడంతో నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన రాజాసింగ్ ఎమ్మెల్యే కరుణాసాగర్.. ఎప్పుడో నమోదైన కేసు గురించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని, ఇన్ని రోజులుగా ఎందుకు ఊరుకున్నట్టని ప్రశ్నించారు. ఇవన్నీ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని, ఏది ఏమైనా కోర్టులో చూసుకుంటామని తెలిపారు. కోర్టులు, చట్టాలను గౌరవిస్తామని వ్యాఖ్యానించారు.