Mani movie dasara Telangana accent trending in Tollywood movies
mictv telugu

టాలీవుడ్‌ల ఎక్క బుగ్గ లెక్క ఎల్గిపోతున్న తెలంగాణ యాస – కథ

February 1, 2023

Mani movie dasara Telangana accent trending in Tollywood movies

తెల్గు సిన్మా ఇండస్ట్రీల తెలంగాణ యాస, భాష, కత, కట్టు బొట్టు, మాట ముచ్చట అన్ని ఎక్కబుగ్గ లెక్క ఎల్గిపోతున్నయ్ కొన్నిదినాల్సంది. నిన్నియాల కొత్తగొచ్చిన దసరా టీజర్‌తోని ఆ మాట మల్లోసారి సారి దున్యాకు సరింగ తెలిశొచ్చింది. ఆ సిన్మా డైరెక్టర్ ఎవలో గాదు.. సింగరేణి పిలగాడు శ్రీకాంత్ ఓడెల. డైరెక్టరుగ ఫస్టు సిన్మానే ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మళయాళం ఐదు భాషలల్ల రిలీజ్ జేస్తున్నరంటే సిన్మాల ఎంత దమ్ముందో అర్థం జేస్కోర్రిగ. ఇప్పటికే పాట, టీజర్ సూస్తె అర్థమైపోయింది సింగరేణి దిక్కున్న ఊళ్లె నడిశే కతా అని. ఆ లుక్కు, డైలాగుతోని నాని న్యాచురల్ స్టారే గని.. నాటురల్ అనిపిచ్చుకున్నడు పబ్లికుతోని.

ఇంక మొన్న టీజర్ రిలీజ్ జేస్తప్పుడు స్టేజీ మీద మాట్లాడుకుంట.. టాలీవుడ్‌కి, ఇండియన్ సిన్మాకి నేనిస్తున్న గ్రేట్ కాంట్రిబ్యూషన్ శ్రీకాంత్ అని స్టేజీ మీదన్నడు నాని. ఈయవ్వ.. డైరెక్టర్లు హీరోలకి ఎలివేషన్లిస్తరు గని.. ఓ స్టార్ హీరోనే ఈ రేంజు ఎలివేషన్లిస్తున్నడంటే ఇద్ది గదా మజా అంటే అనిపిస్తలేదు. ఎంతయినా సుకుమార్ శిష్యుడాయే.. టీజర్‌తోనే గుర్వుకు తగ్గ శిష్యుడు అనిపిచ్చుకున్నడు.

ఇంకోదిక్కు ప్రపంచమే మెచ్చుకుంటున్న రాజమౌళి గూడ ఓ కొత్త డైరెక్టర్ ఈ రేంజుల తీసుడంటే గ్రేట్, ఇంక అండ్ల లాస్ట్ షాట్ తోపసలు అని ట్విట్టర్ల రాశిండు. నాని గూడ రిమెంబర్ దిస్ నేమ్, యాదివెట్కోర్రీపేరు అని ఇంగ్లీషుల రాశిపెట్టిండు. ఇవే కిక్కంటే ఈ లెక్కన ఇంక రేపు మార్చి 30 తారీఖు సిన్మా రిలీజైనంక మాస్ మేకింగ్ తోని కుత్కెల కచ్చా వోశినంత కిక్కిస్తడు గావొచ్చు.

అప్పట్లొచ్చిన కొత్తపోరడు వెబ్ సిరీసు గూడ తెలంగాణ యాస, కథతోనే వచ్చి ఓటీటీల ఓ రేంజు హిట్టు కొట్టింది. అటెంక మల్లేశం, మెయిల్ అని కంబాలపల్లి కథలు, ఫలక్ నుమా దాస్, గద్దల కొండ గణేష్, ఫిదా, లవ్ స్టోరీ ఇవన్నీ గూడ ఇక్కడి యాసతోనొచ్చినయే. నిన్న మొన్నవాల్తేరు వీరయ్య సిన్మాల రవితేజ తెలంగాణ యాస మాట్లాడిండు. అనిల్ రావిపూడి డైరెక్షన్ల బాలక్రిష్ణ జేస్తున్న కొత్త సిన్మాల కూడా తెలంగాణ యాస మాట్లాడి ఇట్టు కొట్టే పన్లెవడ్డడు. అంతెందుకు.. హైద్రావాద్ గల్లి పోరగాడు రాహుల్ సిప్లిగంజ్ వాడిన నాటు నాటు పాట ఆస్కార్ బరిల బరాబర్ నిల్వడి రాణిగంజ్ అఫ్జల్ గంజ్, తోపురా రా రాహుల్ సిప్లిగంజ్ అనిపిచ్చింది జనాలతోని.

ఇంకోదిక్కు దిల్ రాజు అసుంటోళ్లు టాలీవుడ్ల టాప్ ప్లేసులుండి తోపులనిపిచ్చుకున్నరు. ఇంక రాను రాను మస్తు మంది డైరెక్టర్లు, హీరోలు, సింగర్లు, యాక్టర్లు, రాశేటోళ్లు, తీశేటోళ్లు బాజాప్త వచ్చుడు పక్కనే, తెలంగాణ యాస భాషతోని ఇక్కడి కతలను దున్యాకు జెప్పి దుమ్ములేపుడే. ఎట్లయితే గట్లాయే, గుండుగుత్తగ కొత్త కొత్త కతలు తీసుడే. అగ్గివెట్టుడే.