చదవలేక జీవిడిసిన చిన్నోడు !? - MicTv.in - Telugu News
mictv telugu

చదవలేక జీవిడిసిన చిన్నోడు !?

July 29, 2017

తొమ్మిదో తరగతి చదువుతున్న మణి నిహాల్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు. కారణం చాలా చిన్నది.. సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్ లోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో చదువుతున్న మణి నిహాల్ బలవణ్మరణం అక్కడ చాలా మందిని కంటతడి పెట్టించింది. స్కూల్లో నిర్వహించే వీక్లీ టెస్టులో టీచర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో తనకుతాను ఏదో చాలా పెద్దగా, భయంగా వూహించుకున్నాడు. తనకు ర్యాంకు రాదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది ? ఎంతో భవిష్యత్తు వుందనుకున్న పిల్లవాడు ఇలా అర్థాంతరంగా కన్న కొడుకు తనువు చాలించడంతో వాళ్ళ దుఖ్ఖానికి అంతులేకుండా పోయింది ??

చదువురాని వాళ్ళు అలాగే తయారయ్యారు.. చదువులో షార్ప్ గా వుండేవాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకిలా అంటే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల మీద వాళ్ళ మేథస్సుకు మించి రుద్దడమే కాదు, ర్యాంకుల పరుగులో వాళ్ళను పరిగెత్తమని రేసు పెట్టడమే !? దీంతో పిల్లల మీద తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. వాళ్ళ ట్రీట్ మెంటును అందుకోవాలని పాపం పిల్లలు బాగానే కృషి చేసినా ఇంకా ఎక్కువ రుద్దేసరికి ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్నారు. బాగా చదువుతూ కూడా ఎక్కడ వెనకబడిపోతామనే సందిగ్ధంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను టీచర్ల కన్నా ఎక్కువగా చదవమని ఒత్తిడికి గురి చేయడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఏదేమైనా లేత వయసు పిల్లల మీద స్ట్రెస్ మంచిది కాదని అందరూ తెలుసుకుంటే మంచిదేమో !