మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

March 2, 2022

fgbdfgb

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చారిత్రాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. తమిళంలో వచ్చిన ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించింది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసింది. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో విలక్షణ నటుడు విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి ప్రముఖులు నటిస్తున్నారు. చోళ రాజుల కాలం నాటి కథతో వస్తోన్న పొన్నియన్ సెల్వన్ లో ఓ పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తాడని అప్పట్టో ప్రచారం జరిగినా, ఎందుకో అది సాధ్యపడలేదు.