టీకాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్‌గా మాణిక్ రావు ఠాక్రే - MicTv.in - Telugu News
mictv telugu

టీకాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్‌గా మాణిక్ రావు ఠాక్రే

January 4, 2023

 

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్ రావు ఠాక్రే నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న మాణికం ఠాగూర్‌ను బదిలీ చేసి గోవా ఇంఛార్జీగా నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ కాంగ్రెస్ నేతల అసంతృప్తే ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది. బదిలీ కన్ఫామ్ కావడంతో బుధవారం సాయంత్రం మాణిక్కం ఠాగూర్ అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగారు. దానికి ముందు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విష్ చేశారు. మరి కొత్త ఇంఛార్జ్ రాకతో కాంగ్రెస్‌లో విభేదాలు ఏమేరకు పరిష్కారమవుతాయో చూడాలి.