పరీక్షా కేంద్రంలో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న12వ తరగతి విద్యార్థులు ఒక్కసారిగా తిరగబడ్డారు. మరో ఐదు నిమిషాల్లో పరీక్ష ముగియనుండగా.. తమకు ఎగ్జామ్ రాయడం ఇంకా పూర్తికాలేదని, మరికొంత సమయం కావాలని డిమాండ్ చేస్తూ నానా రచ్చ చేశారు. ఈ ఘటన మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తౌబాల్ జిల్లా యైరిపోక్‌లోని ఏసీఎంఈ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో శనివారం మణిపురి పేపర్ పరీక్ష నిర్వహించారు.
అయితే ఏసీఎం స్కూల్‌లో 405 మంది పరీక్ష రాస్తున్నారు. వారిలో కొందరు తమకు పరీక్ష రాయడానికి సమయం సరిపోలేదని, మరికొంత టైమ్ ఇవ్వాలని ఇన్విజిలేటర్‌ను కోరారు. అయినా నిర్వాహకులు తమపని తాము చేసుకుపోయారు. నిర్ణీత సమయానికే చివరి గంట మోగింది. ఐదు నిమిషాల్లో సమయం ముగుస్తుండగా ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఏకంగా ఎగ్జామ్ సెంటర్‌లో ధ్వంసం చేశారు. స్కూల్‌లో బెంచీలు విరగొట్టారు. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఓ టీచర్‌తో సహా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధ్యులైన 8 మంది విద్యార్థులపై కేసు నమోదుచేశారు