Home > Featured > ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం.. హెల్మెట్ లేనివాళ్లకు..

ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం.. హెల్మెట్ లేనివాళ్లకు..

Manipur Police.

బైక్‌పై వెళ్లే వారు హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రావడంలేదు. చలాన్లతో ఫైన్లు వేసినా మార్పు పెద్దగా కనిపించడం లేదు. దీంతో మణిపూర్ పోలీసులు ఓ వినూత్న నిర్ణయానికి వచ్చారు.స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న వారిని పలకరించి వారికి స్వీట్లు ఇచ్చి హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

నిర్లక్ష్యపు ధోరణిని తరిమేందుకు చురాచంద్‌పూర్‌లోని ట్రాఫిక్ పోలీసులు స్వీట్లు పంపిణీ చేసి భద్రతా చిట్కాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా అయినా ప్రజల్లో మార్పు వస్తుందని తాము అనుకుంటున్నామని చెబుతున్నారు. గట్టిగా చెబితే ఎవరూ వినరు కాబట్టి ఇలా వినూత్నంగా వారి కోసం బుజ్జగింపులా ఈ చర్యలు చేపట్టామని ఎస్పీ అమృతా సిన్హా. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే అంతకు ముందే అప్రమత్తంగా ఉండే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూశాక ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందేమోనని ఆకాంక్షిస్తున్నారు.

Updated : 2 Sep 2019 4:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top