కష్టజీవుల కోసం క్వారంటైన్ గుడిసెలు.. విశేషాలివీ - MicTv.in - Telugu News
mictv telugu

కష్టజీవుల కోసం క్వారంటైన్ గుడిసెలు.. విశేషాలివీ

May 15, 2020

mnjg

కరోనా కారణంగా ఉపాధి పోవడంతో వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. రాష్ట్రాలను దాటుకొని ఇలా గ్రామాలకు వెళ్తున్నవారు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు లేక, ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. కానీ మణిపూర్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. గ్రామస్థులంతా కలిసి ఏకంగా 80 గుడిసెలను ఊరి చివర ఏర్పాటు చేశారు. అందులో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి తమవారికి అండగా ఉంటున్నారు. కష్ట జీవుల కోసం ఏర్పాటు చేసిన ఈ క్వారంటైన్ గుడిసెలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. 

టూంజాయ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ గుడిసెలు సాదాసీదాగా వేసినవి కావు. దీంట్లో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్, కరెంట్ సౌకర్యం, ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఏర్పాటు చేశారు. వీరి అవసరాలకు కావాల్సిన నీటి సదుపాయం కూడా గ్రామ పంచాయతీ కల్పించింది. ఈ విషయం తెలిసి స్వయంగా 

మణిపూర్ సీఎం  బీరేన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే  తన ట్విట్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. టూంజాయ్ గ్రామస్తుల క్రమశిక్షణకు ప్రశంసలు కురిపించారు. వారి క్రమశిక్షణ కష్టించే తత్వం ఎందరికో ఆదర్శమని అన్నారు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు అక్కడి ప్రజలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రాష్ట్రానికి చెందిన దాదాపు 40 వేల మంది ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో కూలీ కోసం వలస వెళ్లిన సంగతి తెలిసిందే.