క్రికెటర్ మనీశ్ పాండే పెళ్లయిపోయింది.. అందాల నటితో - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెటర్ మనీశ్ పాండే పెళ్లయిపోయింది.. అందాల నటితో

December 2, 2019

మైదానం ఆటకు, వెండి తెర ఆటకు పెళ్లి జరిగింది. క్రికెట్-సినిమా.. ఈ రెండు రంగాల్లోని వారు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ కోవలోకి భారత క్రికెటర్ మనీష్ పాండే, సినీ నటి ఆశ్రిత శెట్టి చేరారు. ఈరోజు వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్‌లో జరిగింది. మనీష్-ఆశ్రిత కుటుంబ సభ్యులతో పాటు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించి ఫోటోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్ చేసింది. ఈ మేరకు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ.. అంతా శుభమే జరగాలని కోరుకుంది. 

ఐపీఎల్‌లో మనీష్‌ పాండే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.సయ్యద్ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 ట్రోఫీ’ని మనీష్‌ పాండే నేతృత్వంలోని కర్ణాటక జట్టు తాజాగా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు పరుగు తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. 45 బంతుల్లో 60 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మనీష్ పాండే రాణించాడు. కాగా, ముంబైకి చెందిన అశ్రిత(26) 2012లో ‘తెళికెద బొల్లి’ (తుళు భాషా చిత్రం) ద్వారా సినీరంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత ‘ఉదయం ఎన్‌హెచ్‌ 4’ ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్‌ మూను కలవానికుళుమ్‌’, ‘ఇంద్రజిత్‌’ సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది.