భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వండి..మనీష్ తివారి - MicTv.in - Telugu News
mictv telugu

భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వండి..మనీష్ తివారి

October 26, 2019

స్వాతంత్ర సమరయోధ త్రయం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

బ్రిటిషర్లపై తిరుగులేని పోరాటం చేసి ఆనాటి దేశభక్తుల్లో వారు ముగ్గురు స్ఫూర్తి నింపారని తెలిపారు. స్వతంత్ర పోరాటంలో వారు అమరులయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికీ వారిని ప్రజలు ‘షహీద్‌-ఇ-ఆజం’ బిరుదుతో గుర్తుపెట్టుకున్నారు. మొహాలీ ఎయిర్ పోర్ట్‌కు ‘షహీద్‌-ఇ-ఆజం భగత్‌ సింగ్‌’ అని నామకరణం చేశారని పేర్కొన్నారు. 2020 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిని భారతరత్నతో గౌరవించాలని కోరారు. గతంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ఇవ్వాలని కోరారు.