నేపాల్‌కు నటి మనీషా మద్దతు.. అక్కడికే వెళ్లిపోవాలని ట్రోల్ - Telugu News - Mic tv
mictv telugu

నేపాల్‌కు నటి మనీషా మద్దతు.. అక్కడికే వెళ్లిపోవాలని ట్రోల్

May 22, 2020

Manisha

కొన్ని రోజులుగా భారత్ – నేపాల్ మధ్య సరిహద్దు వివాదం జరుగుతోంది. లిపులేఖ్‌, కాలాపాని, లింపియాధురా ప్రాంతాల్ని తమవిగా పేర్కొంటూ ఇటీవల నేపాల్‌ తమ దేశ పటం విడుదల చేసింది. దీనికి ఆ దేశ ప్రధాని కూడా వాటిని ఎలాగైనా తమ భూ భాగంలో చేర్చుకుంటామని ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య వార్ మొదలైంది. ఈ వివాదంలో బాలీవుడ్ నటి మనీసా కొయిరాల చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు నెటిజన్లకు ఎక్కడలేని కోపం తెప్పించింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదంలో నేపాల్‌కు మద్దతుగా ఆమె స్పదించారు. ‘మన చిన్నదేశపు గౌరవాన్ని నిలబెడుతున్నందుకు ధన్యవాదాలు. భారత్‌, నేపాల్‌, చైనాల మధ్య శాంతియుతమైన, గౌరవప్రదమైన చర్చలు జరిగేందుకు అందరం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. దీంతో మా దేశంలో ఉంటూ మాకే వ్యతిరేకంగా పోస్ట్ చేస్తావా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కావాలంటే మీ దేశానికి వెళ్లిపో అంటూ మండిపడుతున్నారు. దీనిపై దివంగత నేత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ కూడా స్పందించారు. భారత్‌కు, నేపాల్‌కు మధ్య ఏవైనా గొడవలుంటే ఉండచ్చేమో కానీ.. మధ్యలోకి చైనా ప్రస్తావన దేనికంటూ ప్రశ్నించారు. కాగా నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాల ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమె  తాత బిశ్వేశ్వర్ కోయిరాల, తండ్రి ప్రకాశ్ కొయిరాల కూడా గతంలో నేపాల్ ప్రధాన మంత్రులుగా ఉన్నారు.