మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత మన్మోహన్ సింగ్ పార్లమెంట్ భవనానికి వీల్‌ఛైర్‌లో వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు పార్లమెంట్ భవనం వద్దకు వీల్‌ఛైర్‌లో వచ్చారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన రహస్య బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. కరోనా, అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న మన్మోహన్ సింగ్.. ఎన్నికల సిబ్బంది సహాయంతో లేచి మన్మోహన్ సీక్రెట్ బ్యాలెట్‌ను బాక్స్‌లో వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోలను చూసిన కొందరు కాంగ్రెస్ నేతలు, ఆయన మద్దతుదారులు ఆయన్ను అలా వీల్‌ఛైర్‌లో చూడటం బాధగా ఉందని.. ఆరోగ్యం త్వరగా బాగుపడాలని కోరుకొంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘తన ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ భవనం వద్దకు వచ్చి తన ప్రజాస్వామిక బాధ్యతను నిర్వహించారు. మనందరికీ అది స్ఫూర్తిదాయకం. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సును ప్రసాదించాలి’’ అని ప్రార్థిస్తూ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ట్వీట్ చేశారు.
खराब स्वास्थ्य के बाबजूद अपनी लोकतांत्रिक जिम्मेदारी निभाने के लिए संसद पहुंचे सरदार मनमोहन सिंह जी हम सभी के लिए प्रेरणा है।
ईश्वर उन्हें बेहतर स्वास्थ्य एवं लंबी आयु प्रदान करें 🙏🙏 pic.twitter.com/Odz5WVHS5c
— Srinivas BV (@srinivasiyc) July 18, 2022