ఈవీఎంలపై హరియానా సీఎం సంచలన ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈవీఎంలపై హరియానా సీఎం సంచలన ట్వీట్

October 17, 2019

Manohar Khattar Tweets On EVM

ఈవీఎంలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ విపక్ష పార్టీలు ఇటీవల వరకు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మోదీ వాటిని ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో హరియానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈవీఎంలపై చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటంతో ఆయన చేసిన కామెంట్‌పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై విపక్షాలు మండిపడటంతో వెంటనే దాన్ని డిలీట్ చేశారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కేడర్‌తో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్వీట్ చేశారు.           ‘పార్లమెంట్‌కు అయితే ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోదీ.. అసెంబ్లీకి అయితే ఎవ్రీ ఓట్ ఫర్ మనోమహర్..తమలో ఎవరికి వేసినా కూడా గుర్తు మాత్రం కమలం’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో వెంటనే దాన్ని డిలీట్ చేశారు. కాగా వరుసగా సంచలన కామెంట్లతో సీఎం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో సోనియా గాంధీని ఎలుకతో పోల్చారు. గతంలో కూడా ఆయన ఇటువంటి అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.