దొంగిలించిన కత్తితోనే.. కూతురు, అల్లుడిపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

దొంగిలించిన కత్తితోనే.. కూతురు, అల్లుడిపై దాడి

September 25, 2018

కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కూతురు, అల్లుడిపై మనోహరాచారి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని మనోహరాచారి చోరీ చేశాడు. కేసు విచారణలో భాగంగా ఎస్సార్‌నగర్ పోలీసులు సీసీ టీవీ పుటేజ్ సేకరించారు. వివరాల్లోకి వెళ్తే… గత బుధవారం ఎర్రగడ్డ ప్రాంతంలో మాధవి అనే యువతిపై తండ్రి మనోహరాచారి కత్తితో దాడి చేశాడు. అయితే నిందితుడిని విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.  Manohara Chari Nife Theft And Attacked his Daughter మనోహరాచారి కూతురు మాధవికి ఫోన్ చేసి ‘అల్లుడు సందీప్‌ను తీసుకుని ఎర్రగడ్డకు రా..  షాపింగ్ చేపిస్తా’ అని పిలిపించాడు. అనంతరం ఆయన ఎస్సార్‌నగర్‌‌లోని ఓ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి, అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ సమీపంలో మద్యం తాగాడు. ఎలాగైన కూతురును చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

మైత్రీ వైన్స్ పక్కనే ఉన్న కొబ్బరిబొండాల దుకాణం వద్ద ఉన్న కత్తిని దొంగిలించి కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేశాడు. అయితే కత్తిని దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.