‘తమిళ పులి’గా మంచు మనోజ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘తమిళ పులి’గా మంచు మనోజ్

August 21, 2017

శ్రీలంక చరిత్రలో నెత్తుటి మరకగా మిలిగిపోయిన అంతర్యుద్ధాన్ని, తమిళుల ఆత్మగౌరవ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా నిర్మించారు. ఇందులో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గా, విద్యార్థి నాయకుడిగా మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లో ఉంది. దీని కోసం మంచు మనోజ్ ఏకంగా 20 కిలోల బరువు పెరిగినట్లు సమాచారం.

90ల నాటి శ్రీలంక అంతర్యుద్ధం, ఇప్పటి సమకాలీన పరిస్థితులు.. రెండు కాలాలకు చెందిన పరిస్థితులనూ ఇందులో స్పృశించినట్లు సమాచారం. ఇటీవల రిలీజైన ట్రైలర్ లో ‘భారద్దేశంలో స్వాతంత్ర్య పోరాటం ఇంకా కొనసాగుతోంటే అల్లూరి, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను మీరు ఏమని పిలుచుకునేవారు? తీవ్రవాదులనా? లేకపోతే దేశ భక్తులనా?.. స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటం తీవ్రవాదమైతే, మనం తీవ్రవాదులమే’ అనే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఎల్టీటీఈపై పోరులో లంక సైనికులు తమిళ మైనారిటీ మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 8న విడుదల కానున్న ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. మనోజ్ కెరీర్ లో ఇది అత్యుత్తమ చిత్రం కానుందని అజయ్ అన్నారు.