9 మంది పిల్లలను చంపిన బీజేపీ నేత ఇంకా చిక్కలేదంట! - MicTv.in - Telugu News
mictv telugu

9 మంది పిల్లలను చంపిన బీజేపీ నేత ఇంకా చిక్కలేదంట!

February 27, 2018

బిహార్‌లో 9 మంది పిల్లలను చంపేసిన బీజేపీ నేత మనోజ్ బైతా ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో విపక్షాలతోపాటు  సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. బీజేపీ.. మనోజ్‌కు కొమ్ము కాస్తోందని మండిపడుతున్నారు. అతణ్ని కేవలం సస్పెండ్ చేశారని, పార్టీ నుంచి బహిష్కరించలేదని ఆక్షేపిస్తున్నారు.ముజఫర్పూర్ జిల్లా మీనాపూర్ బ్లాకులో మనోజ్ శనివారం తప్పతాగి బోలెరో బండి నడపడంతో 9 మంది పసిపిల్లలు చనిపోగా, 20 మంది గాయపడ్డారు. మనోజ్ తర్వాత పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు స్కూలు సిబ్బందిపై దాడి చేశారు. పిల్లల భద్రతలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మనోజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. అతని కోసం వెతుకుతున్నామని చెబుతున్నారు. అయితే మనోజ్ ఎక్కడున్నాడో పోలీసులకు తెలుసని, ప్రభుత్వం అండ ఉండడంతో వారేమీ చేయలేకపోతున్నారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోపక్క.. బీజేపీ అతణ్ని ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. అయితే బహిష్కరించకుండా కేవలం సస్పెండ్ చేయడమేంటని విపక్షాలు విమర్శిస్తున్నాయి.