భారత ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే.. కొత్త రికార్డు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

భారత ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే.. కొత్త రికార్డు నమోదు

April 18, 2022

police..

భారత సైన్యానికి కొత్త అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరవణే సీడీఎస్‌కు కొత్త చైర్మన్‌గా వెళ్తారనే ఊహాగానాల ఉన్నాయి. అయితే నరవణే ఏప్రిల్ చివర్లో రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్‌ను ప్రకటించారు. బిపిన్ రావత్ మరణంతో సీడీఎస్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఇదిలా ఉండగా, మనోజ్ పాండే కొత్త రికార్డును నమోదు చేశారు. ఇంజినీర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆర్మీ చీఫ్ అవుతున్న మొదటి వ్యక్తి మనోజ్ పాండే కావడం విశేషం. 39 ఏళ్ల అనుభవం ఉన్న మనోజ్ పాండే ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులలో కమాండింగ్ సెక్షన్‌లో విధులు నిర్వర్తించారు. కాగా, ఏప్రిల్ 30న మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించనున్నారు.