ఇది రా దళితులకు ఇచ్చే మర్యాద.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇది రా దళితులకు ఇచ్చే మర్యాద.. వీడియో వైరల్

November 26, 2022

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకి అరుదైన గౌరవం లభించింది. నియోజకవర్గానికి చెందిన ఓ సర్పంచ్ అందరి ముందు ఎమ్మెల్యేకు పాదాభివందనం చేశారు. అంబేద్కర్ విగ్రహ పున: ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఈ భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు, శ్రీపతిపల్లి సర్పంచ్ భర్త కేశిరెడ్డి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ రాజయ్యను అంబేద్కర్ తో పోల్చారు. దళితులకు మర్యాద గురించి మాట్లాడిన మనోజ్ రెడ్డి రాజయ్యను లేచి నిలబడమని కోరి ఆయన పాదాలు మొక్కారు.

‘దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడంటే.. ఓ రెడ్డి బిడ్డ, ఓ దొర బిడ్డ సాష్టంగ నమస్కారం చేసినప్పుడు’ అంటూ కాళ్లు మొక్కడంతో రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లు కొడుతూ జై భీమ్ నినాదాలు చేశారు. అనంతరం మనోజ్ రెడ్డి ఇొంకా మాట్లాడుతూ ‘రైతును రాజును చేస్తం. దళితుడిని ఎక్కడో ఉంచుతం అంటే.. దళితుడి కోసం పాదాభివందనం చేస్తున్న మనోజ్ రెడ్డిని చూడండ్రా.. ఇది రా దళితులకు ఇచ్చే మర్యాద’ అంటూ ఉద్వేగంతో ప్రసంగించారు.