మనోజ్ వెడ్స్ మౌనిక...తన వివాహం గురించి మంచుమనోజ్ అధికారిక పోస్టు..!! - Telugu News - Mic tv
mictv telugu

మనోజ్ వెడ్స్ మౌనిక…తన వివాహం గురించి మంచుమనోజ్ అధికారిక పోస్టు..!!

March 3, 2023

భూమా మౌనికారెడ్డిని తాను ఇవాళ పెళ్లి చేసుకుంటున్నట్లు మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించారు. పెళ్లికూతురుగా తయారైన మౌనికారెడ్డి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మనోజ్ వెడ్స్ మౌనికా అంటూ హార్ట్ సింబల్ పోస్ట్ చేశారు మనోజ్. తన సోదరి మంచు లక్ష్మీ నివాసంలో ఇవాళ రాత్రి 8.30గంటలకు వివాహం జరగున్నట్లు తెలిపాడు. ఈ పోస్టు చూసిన అభిమానులు, మనోజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు మనోజ్ మొదటి పెళ్లి కూడా మంచు లక్ష్మీ ఇంట్లోనే జరిగింది. ఇప్పుడు రెండో పెళ్లి కూడా తన ఇంట్లో జరిపిస్తోంది. కాగా 2019లో ప్రణతితో మనోజ్ విడాకులు తీసుకున్నారు. తన వదినా మంచు విష్ణుభార్య వెరొణికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి. ఆమెను 2015లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.