చేతులెత్తి మొక్కుతున్నా.. కరోనా వారియర్స్‌కు మంత్రి గౌరవవందనం   - MicTv.in - Telugu News
mictv telugu

చేతులెత్తి మొక్కుతున్నా.. కరోనా వారియర్స్‌కు మంత్రి గౌరవవందనం  

April 7, 2020

Manpreet Badal salutes Bathinda Doctors, Paramedics

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మరితో పోరాటంలో ముఖ్యంగా వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు కీలకంగా నిలిచారు. వారి సేవలు అనన్య సామాన్యం అంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి గౌరవ వందనం చేసిన విషయం తెలిసిందే. వారి ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపడటానికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. అంతేకాకుండా వారికి నెల జీతం బోనస్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 

కరోనా సంక్షోభంలో వెన్నుదన్నుగా నిలబడిన పంజాబ్‌లోని బతిండా వైద్యులు, పారామెడిక్స్ మరియు ఇతర ఆరోగ్య సిబ్బందికి పంజాబ్ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వారియర్స్‌లో భాగమైన ఆరోగ్య బృందానికి, బతిండా పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవ వందనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్‌లో పంచుకున్నారు. నిన్న కేసీఆర్ వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులకు సలాం చేసిన విషయాన్ని గర్తు చేశారు.

వీడియోలో మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ మాట్లాడుతూ..  ‘కరోనా సంక్షభంలో పంజాబ్ డాక్టర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, గాంధీజీ, సర్దార్ పటేల్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు పుట్టారు. కరోనాతో ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారు. మీరంతా వారంతటి మహనీయులే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా’ అని వారికి నమస్కిరించారు. 

Manpreet Badal salutes Bathinda Doctors, Paramedics

ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਤ ਮੰਤਰੀ ਸ ਮਨਪ੍ਰੀਤ ਸਿੰਘ ਬਾਦਲ ਨੇ ਸੋਮਵਾਰ ਨੂੰ ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਬਠਿੰਡਾ ਦੇ ਡਾਕਟਰਾਂ ਅਤੇ ਪੈਰਾਮੈਡੀਕਲ ਸਟਾਫ਼ ਦੀ ਉਸ ਜਗ੍ਹਾ ਪੁੱਜ ਕੇ ਸ਼ਲਾਘਾ ਕੀਤੀ ਅਤੇ ਧੰਨਵਾਦ ਕੀਤਾ ਜਿਸ ਜਗ੍ਹਾ ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਦੀ ਬਠਿੰਡਾ ਇਕਾਈ ਵੱਲੋਂ ਕੋਰੋਨਾਵਾਇਰਸ ਨਾਲ ਲੜ ਰਹੀ ਇਸ ਡਾਕਟਰੀ ਟੀਮ ਦੇ ਸਨਮਾਨ ਵਿਚ ਇਕ ਰਸਮੀ ਸੈਲਿਊਟ ਦਾ ਆਯੋਜਨ ਕੀਤਾ ਗਿਆ ਸੀ। Punjab FM Manpreet Singh Badal, Monday thanked Bathinda Doctors, Paramedics & other Health Staff for standing upto Corona Crisis as he led a salute by Bathinda Police. The Bathinda Police, themselves a part of CoronaWarriors,j had organized a salute to thank Health team.

Publiée par Yes Punjab sur Dimanche 5 avril 2020