సోషల్ మీడియాలో ఉద్యోగావకాశాల కోసం, ఉద్యోగ అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అదనపు అవకాశాలను కలిగిస్తుంది. కానీ ఒక వ్యక్తి వార్తపత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఆ పేపర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. లింక్డ్ ఇన్ వంటి నెట్ వర్కింగ్ సైట్లలో ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయడం సాధారణ పద్ధతి. ఉద్యోగులు కూడా వారి రెజ్యూమెలతో కళాత్మకంగా ఇందులో పోస్ట్ చేస్తుంటారు. కొందరు వారు దరఖాస్తు చేస్తున్న సంస్థకు సరిపోయేలా వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంటారు. ఒకప్పుడు పేపర్లలో ఉద్యోగ అవకాశాలు పోస్ట్ చేయడం చూశాం. కానీ ఈ మధ్య కాలంలో అది బాగా తగ్గిపోయింది. కానీ ఒక వ్యక్తి దానిని చేసి అందరికీ నవ్వు తెప్పించాడు.
బైక్ నేర్పించమంటూ..
ఒక ప్రధాన వార్తాపత్రిక 10వ పేజీలో ఒక ప్రకటన వచ్చింది. ఒక వ్యక్తి బైక్ బోధకుడి కోసం ఉద్యోగం ఉందని ప్రకటించాడు. అక్కడి వరకు ఓకే! కానీ.. ఆ శిక్షకుడికి ఏమేం ఉండాలో, తనకి ఏం అవసరమో రాసుకొచ్చాడు. అదేంటంటే.. ‘నా పేరు ప్రవీణ్ భాయ్ సుదాని. నేను బైక్ నడపడం నేర్చుకోవాలి. దానికోసం వచ్చేవాళ్లు శ్రద్ధ వహించాలి. నేను ఇబ్బంది పడాలనుకుంటే నాకు నేర్పించమని మా నాన్నను అడిగాను. నాకు నేర్పించేవాళ్లు మిథునరాశి వాళ్లయి ఉండకూడదు. ఎందుకంటే వారు అజాగ్రత్తగా ఉంటారు. అతనికి అనిమే అంటే ఇష్టమైతే.. నేను నరుటో గురించి మాట్లాడుతాను. ఇది జావా బాబర్ బైక్. నేను క్రెడ్ స్టోర్ లో బిడ్ బ్లాస్ట్ ఆడడం ద్వారా సంపాదించాను. కాబట్టి దయచేసి నన్ను ఫేక్ డబ్బులు అడగకండి’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ పోస్ట్ కి 6 వేల లైకులు, 4 లక్షల వ్యూస్ వచ్చాయి. కొందరు ‘ప్రవీణ్ భాయ్ కోరిక నేను ఈ జన్మలో తీర్చలేనేమో..’ అని, ‘బీసీసీఐలో ఈజీగా ఉద్యోగం సంపాదించొచ్చు, ఇతని దగ్గర కంటే.. ’ అని మరొకరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రవీణ్ భాయ్ కి తను అనుకున్న వ్యక్తి దొరుకుతాడో లేదో మరి?!