Man's Body Found 4 Years After Wife & Lover Killed And Buried Him At Home In Ghaziabad
mictv telugu

ప్రియుడితో కలసి భర్తను చంపి.. అతడి ఇంట్లోనే పాతిపెట్టింది

November 15, 2022

తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తనే హతమార్చింది. అనంతరం ప్రియుడి ఇంటిలో గొయ్యి తీసి భర్త మృతదేహాన్ని పాతిపెట్టేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో 2018లో జరిగిందీ దారుణం. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత ఈ కేసును గాజియాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించగా.. వారు ఈ కేసును ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చంద్రవీర్ సింగ్ 2018 ఆగస్టు 5న హత్యకు గురయ్యాడు. తన భర్త కిడ్నాప్ అయ్యాడని బాధితుడి భార్య గాజియాబాద్ పోలీసులకు చెప్పడం వల్ల ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడం వల్ల గాజియాబాద్ క్రైమ్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు. మృతుడి సరైన పద్ధతిలో విచారించగా.. తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది. బాధితుడి మృతదేహాన్ని గొయ్యిలో నుంచి వెలికితీసి.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాగా కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందని తెలిపారు.