అంబులెన్స్ గుంతలో పడింది.. రోగికి ప్రాణం లేచొచ్చింది.. - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్ గుంతలో పడింది.. రోగికి ప్రాణం లేచొచ్చింది..

April 24, 2019

నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అంబులెన్స్  ప్రమాదం ఓ గుండెజెబ్బు రోగిని కాపాడింది. అచ్చం సినీఫక్కీలో అతడు దిగ్గున లేచి కూర్చుకున్నాడు. అంబులెన్స్ అదుపుతప్పి భారీ గుంతలో పడ్డంతో అతనికి ప్రాణం లేచొచ్చింది. అమెరికాలోని నెబ్రెస్కాలో ఈ విచిత్రం జరిగింది.

hits a huge pothole and jolts his rhythm

59 ఏళ్ల వ్యక్తి హఠాత్తుగా గుండెనొప్పితో బాధపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అతణ్ని పరీక్షించిన అంబులెన్స్ సిబ్బంది గుండె నిమిషానికి ఏకంగా 200 సార్లు కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతణ్ని వాహనంలోకి ఎక్కించి, 10 కిలో మీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకుపోయారు. దారిమధ్యలో అంబులెన్స్ అదుపు తప్పి భారీ గుంతలో పడిపోయింది. దబ్బుమని పడేసరికి లోపలు ఉన్న సిబ్బంది హడలిపోయారు. రోగికి ఏమైందోనని కంగారు పడుతుండగా అతడు దిగ్గున లేచి కూర్చున్నాడు.  వారు నోరెళ్లబెట్టేశారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా,  అంబులెన్స్ గుంతలో పడ్డంతో ఆ భారీ కుదుపు కరెంటు షాక్‌లా పనిచేసి అతని గుండె లయ మళ్లీ గాడిపడిందని తేల్చారు.