manti panesar respond on indian cricket team
mictv telugu

భారత్ జట్టు నుంచి ఆ ముగ్గురికి రిటైర్మెంట్ తప్పదు

November 15, 2022

టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో భారత్ ఓటమి కొత్త ఆలోచనలకు తెరలేపింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీం ఇండియా..ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జట్టు ఎంపిక నుంచి..ఆటగాళ్ల ఫెర్పార్మెన్స్‌ వరకు విమర్శలు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా త్వరలోనే భారీ మార్పులను చేస్తోదంటూ వార్తలొస్తున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లకు పెద్దపీట వేయనున్నారట. ఇక ప్రస్తుత జట్టులోని పలువురు సీనియర్లు ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు. అశ్విన్, దినేష్ కార్తీక్, షమీ వంటి ఆటగాళ్లు తర్వాత కనిపించకపోవచ్చని అంటున్నారు.

ఇదే సమయంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2024 వరల్డ్ కప్‌కి పలువురు భారత కీలక ఆటగాళ్లు దూరం అవుతారని జోష్యం చెప్పాడు. దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల స్థానాలు గల్లంతయ్యే అవకాశం ఉందన్నాడు. కోహ్లీ మాత్రం జట్టులో ఉండొచ్చని మాంటీ పనేసర్ తెలిపాడు. కచ్చితంగా టీమ్ మేనేజ్ మెంట్ వీరిని పిలిచి భవిష్యత్తు ప్రణాళికల గురించి అడుగుతుందని తెలిపాడు. ఇక వీళ్లందరూ టీ20లకు దూరమయ్యి..వన్డేలు,టెస్ట్‌పై దృష్టి సారించే అవకాశం ఉందన్నాడు.