హైదరాబాద్‌లో విశ్వసుందరి సందడి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో విశ్వసుందరి సందడి

November 29, 2017

హైదరాబాద్ ప్రముఖుల రాకతో పోటెత్తుతోంది. జీఈఎస్ సదస్సులో పాల్గొనడానికి తాజా విశ్వసుందరి మానుషి చిల్లార్ నగరంలోకి అడుగుపెట్టింది. తాను ఇంత పెద్ద సదస్సులో పాల్గొంటున్నందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది.

‘ఇంతమంది ప్రముఖుల ముందు, గొపవాళ్ల ముందు మాట్లాడే గొప్ప అవకాశం నాకు లభించింది… ’ అని చెప్పింది. మహిళల సాధికారత సాధనం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, తాను మహిళలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించే పనిలో ఉన్నానని చెప్పారు.. మానుషి చిల్లర్ చైనాలో జరిగిన మిస్ వరల్డ్ 2017 పోటీలో గెలుపొందడం తెలిసిందే.