Home > Featured > తెలుగు ఇండస్ట్రీలో నన్ను చాలా మంది కమిట్‌మెంట్‌ అడిగారు

తెలుగు ఇండస్ట్రీలో నన్ను చాలా మంది కమిట్‌మెంట్‌ అడిగారు

"ఓసారి ఈవెంట్‌కు వెళ్తే, 30 మంది ఫుల్‌గా తాగొచ్చి, రాత్రి నన్ను అటాక్‌ చేశారు. నేను ఏదోలా తప్పించుకుని ఇంటికొచ్చి తెగ ఏడ్చాను. తెలుగు ఇండస్ట్రీలోనే నన్ను చాలామంది కమిట్‌మెంట్‌ అడిగారు. కొందరు ఫోన్‌లో, ఇంకొందరు నేరుగా చూపుల సైగలతో. ఈ సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కాకపోతే, అప్పుడు సోషల్‌ మీడియా లేదు. ఇప్పుడు ఏదైనా జరిగితే, పేరుతో సహా సోషల్‌ మీడియాలో అన్నీ బయటపెట్టొచ్చు" అని కేరింత సినిమాలో కీలకపాత్రలో నటించిన తేజస్వి మదివాడ అన్నారు.

తాజాగా ఆమె కీలకపాత్రలో నటించిన చిత్రం 'కమిట్‌మెంట్‌'. ఈ చిత్రంలో తేజస్వితోపాటు అన్వేషి జైన్‌, సీమర్‌ సింగ్‌, తనిష్క్‌ రాజన్‌, అమిత్‌ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ సింహా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మీ కాంత్‌ చెన్న దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 19న) రిలీజైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తేజు ఆమె ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది.

"సినీ పరిశ్రమలో కమిట్మెంట్ అడుగుతారనేది పచ్చి నిజం. వారికి లొంగిపోకుండా, ధైర్యంగా ఉండాలి. అలాంటి వాళ్లకు లొంగిపోయిన తర్వాత మోసపోయాం అని చెప్పడం సరైంది కాదు. నేను సినిమాలు చేస్తూనే ఈవెంట్లకు వెళ్లేదాన్ని. ఈవెంట్లకు వెళ్లినప్పుడు జనాలు ఫుల్లుగా తాగి నా చుట్టూ చేరి వేధించేవారు. వారి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడేదాన్ని".

Updated : 19 Aug 2022 11:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top