రేపే చంద్రగ్రహణం.. ప్రముఖ ఆలయాల మూసివేత - MicTv.in - Telugu News
mictv telugu

రేపే చంద్రగ్రహణం.. ప్రముఖ ఆలయాల మూసివేత

November 7, 2022

many temples to remain closed tomorrow over lunar eclipse in Telugu states

ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మూతపడిన ప్రముఖ ఆలయాలు మరోసారి మూతపడనున్నాయి. నవంబరు 8న(మంగళవారం) చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.

కాగా, మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం ముగిసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఈనేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఇందులో భాగంగా నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. బ్రేక్‌దర్శనాలు, ఆర్జితసేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది.

many temples to remain closed tomorrow over lunar eclipse in Telugu states

భారత దేశంలో పాక్షిక చంద్ర గ్రహణం ఉండడంతో చంద్ర గ్రహణాన్ని మనం చూసే అవకాశం లేదు. అయినప్పటికీ చంద్రగ్రహణం ప్రభావం మనపై ఉంటుందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని, వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.