హిండెన్‌బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూపు చేసిన మోసాలు, అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణం పేరుతో భారీగా నిధులు సేకరించిన అదానీ గ్రూపులో కోల్ మైనింగ్ కంపెనీల్లో పెట్టుబడుల కోసం దారి మళ్లించారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఓ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. అదానీ గ్రూప్ ఎనర్జీ పేరుతో వసూలు చేసిన కోట్లాది రూపాయలను అదానీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఆస్ట్రేలియాలోని కార్మికెల కోల్ మైన్ ప్రాజెక్టుకు పెట్టుబడుల రూపంలో నిధులు వెళ్లినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 10నాటి పబ్లిక్ ఫైలింగ్ రిపోర్టులను విశ్లేషిస్తే…అదానీ గ్రూపుకు సంబంధించిన ఆగడాలన్నీ బయటపడుతాయని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఈ క్రమంలోనే నార్వేకు చెందిన పెన్షన్ ఫండ్ కేఎల్ పి..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి తన షేర్ల ఉపసంహిరించుకుంటున్నట్లు వెల్లడించింది. పర్యావరణాన్ని ప్రోత్సహించే కేఎల్ పీ…బొగ్గు తవ్వకలను వ్యతిరేకిస్తుంది. కార్మికెల్ కోల్ ప్రాజెక్టుకు ఏ విధంగా నిధులు సమకూర్చినా..అది తమ కట్టుబాట్లకు వ్యతిరేకం అవుతుందని కేఎల్పీ అసెట్ మేనేజ్ మెంట్ వెల్లడించింది.
కాగా గ్రీన్ ఎనర్జీ పేరుతో అదానీ గ్రూపు ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు నార్వే ప్రభుత్వానికి చెందిన వెల్త్ ఫండ్ ఈ మధ్యే తీసుకున్న నిర్ణయాలను బట్టి అర్థమౌతోంది. అదానీ గ్రూపులో పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు వెల్త్ ఫండ్ ఈ మధ్యే ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తుంటే అదానీ అక్రమాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం అవుతుంది. 2022నాటికి ఈ నార్వేజియన్ ఫండ్ వద్ద 52.7 మిలియన్ డాలర్ల విలువైన అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 83.6 మిలియన్ డాలర్ల అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 63.4 మిలియన్ డాలర్ల అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షర్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 1800కోట్లు. 2014 నుంచి 2022 వరకు ఐదు కంపెనీల షేర్లను విక్రయించామని…మరో రెండు కంపెనీల షేర్ల నుంచి వైదొలిగామని..అదానీ గ్రూపులో తమకు వాటాలేవీ లేవని స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ కు చెందిన 500కుపైగా ఫండ్ రిజిస్టర్డ్ కంపెనీలు అదానీ స్టాక్స్ ను అనుమతించే ఛాన్స్ లేదని బ్లూమ్ బర్గ్ విశ్లేషించింది. వీటన్నింటినపై అదానీ గ్రూప్ నుంచి స్పందన కోరగా..ఎలాంటి సమాధానం లేదని వెల్లడించింది.