గిడ్డి ఈశ్వరికి శిక్ష తప్పదు.. మావోల లేఖపై ఆరా - MicTv.in - Telugu News
mictv telugu

గిడ్డి ఈశ్వరికి శిక్ష తప్పదు.. మావోల లేఖపై ఆరా

October 10, 2018

టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ హత్యలకు కారణాలను తెలుపుతూ మావోస్టులు ఓ లేఖను విడుదల చేశారు. మావోస్టుల సెంట్రల్ కమిటీ పేరుతో మంగళవారం (అక్టోబర్ 9) విడుదలైంది. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.Maoist Central Committee Letter To Media Over Bauxite mining ‘కిడారి, సోమా గిరిజన ద్రోహానికి పాల్పడ్డారు. అందుకే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించాం. బాక్సైట్‌ తవ్వకాలకు వారు అనుకూలంగా వ్యవహరించారు. గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించినా వారు తమ పద్ధతి మార్చుకోలేదు ’అంటూ లేఖలో  తెలిపారు. అదే లేఖలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని హెచ్చరిస్తూ… ‘గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి రూ. 20 కోట్లకు అమ్ముడుపోయింది. గిడ్డి ఈశ్వరి బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. పద్ధతి మార్చుకోకపోతే కిడారి, సోమకు పట్టిన గతే పడుతుంది’ అంటూ తీవ్రంగా  హెచ్చరించారు.Maoist Central Committee Letter To Media Over Bauxite mining అంతేకాకుండా తమకు పోలీసులతో ఎలాంటి శతృత్వం లేదని, వారు ఆయుధాలతో దొరికినా హాని తలపెట్టమని తెలిపారు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్న పోలీసులను క్షమించి వదిలిపెట్టామని మావోలు తెలిపారు. కానీ విప్లవసోదరులు దొరికితే మాత్రం ఎన్‌కౌంటర్లు పోలీసులు చేస్తున్నారని ఆరోపించారు. అయితే మావోయిస్టుల పేరుతో విడుదలైన ఆ లేఖపై పోలీస్ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. లేఖపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి నిఘా వర్గాలు.