గడ్చిరోలి ఎన్‌కౌంటర్ మృతుల్లో గణపతి! - MicTv.in - Telugu News
mictv telugu

గడ్చిరోలి ఎన్‌కౌంటర్ మృతుల్లో గణపతి!

April 24, 2018

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ప్రాణనష్టంపై పోలీసులు కచ్చితమైన సమాచారం వెల్లడించడం లేదు. ఇప్పటివరకు 37మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు గణపతి కూడా ఉండొచ్చని గడ్చిరోలి డైజీ అంకుశ్ షిండే చెప్పారు. ఆదివారం, సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్లలో 37 మంది నక్సల్స్ చనిపోయారని తెలిపారు.

‘ఇంకో రెండు మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. సీ60 కమాండంట్ పోలీసులు కాస్వాపూర్ అడవుల్లో నక్సల్స్ సమావేశాన్ని చుట్టిముట్టినప్పుడు వారిలో గణపతి కూడా ఉన్నట్లు మాకు సమాచారం ఉంది’ అని షిండే చెప్పారు. గణపతి ఎన్కౌంటర్లో చనిపోయిందే నిజమైతే  దేశంలో మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బే. కరీంనగర్ జిల్లాకు చెందిన గణపతి స్కూలు టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి దళపతి అయ్యాడు. 2004లో పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ పార్టీల విలీనమై మావోయిస్టు పార్టీ అవతరించినప్పటినుంచి దానికి సారథ్యం వహిస్తున్నారు.