మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో ప్రధాన నిందితుడైన మావోయిస్టు నాయకుడు జనుమూర్ శ్రీనుబాబు అలియాస్ రైనోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం నక్సలైట్లకు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయని, తర్వత రైనో తమకు దొరికాడని పోలీలు చెప్పారు.
ఏఓబీలో పలు విధ్వంసాలు, హింసాత్మక చర్యల కేసులో రైనో కీలక పాత్ర పోషించాడని పోలీసులు చెబుతున్నారు. అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. రైనో దగ్గరి నుంచి పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యల కేసులో మరో కీలక నిందితుడైన సాంబ ఖరా అలియాస్ రణదేవ్ ఇదివరకే లొంగిపోయాడు. 2018లో కిడారి, సోమ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని వస్తుండగాడుంబ్రిగుంట మండలం లివిటిపుట్ గ్రామం సమీపంలో హత్యకు గురయ్యారు.