Maoist party leader Hidma encounter
mictv telugu

తెలంగాణ పక్కలో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో హిడ్మా!

January 11, 2023

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హిడ్మా భద్రతా బలగాలపై పలు కీలక దాడులను దగ్గరుండి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్ సరిహద్దుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు కలసికట్టుగా కూంబింగ్ చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో సమావేశమయ్యారని ఉప్పందడంతో బలగాలు చుట్టుముట్టాయి. భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, మావోయిస్టు మృతులను గుర్తించే పనిలో ఉన్నారని పోలీసులు వర్గాలు చెప్పాయి. అయితే మృతుల్లో హిడ్మా ఉన్నాడో లేడో చెప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 42 ఏళ్ల హిడ్మా ఆరితేరిన వ్యూహకర్త. పోలీసులు జాడ కనిపెట్టి దాడిని సక్సెస్ చేస్తాడని పేరు. అతని సారథ్యంలో జరిగిన దాడుల్లో 25 మంది జవాన్లు చనిపోయాడని చెబుతారు.