ములుగు జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు.. అసలు విషయం ఇది - MicTv.in - Telugu News
mictv telugu

ములుగు జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు.. అసలు విషయం ఇది

October 13, 2020

nvhnhvmn

ములుగు జిల్లాలో మళ్ళీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతను హత్య చేయడంతో ఏజెన్సీ ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. తాజాగా మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. షాపల్లి గ్రామంలో గొడలకు అర్ధరాత్రి పోస్టర్లు అంటించి వెళ్లారు. అడవుల్లో బలగాల కూంబింగ్ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. లేకపోతే భీమేశ్వర్ రావుకు పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను కూడా అందులో హెచ్చరించారు. డీఆర్వో ప్రహ్లాద్, రవీందర్, సందీప్ పద్దతి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యపై పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తన బొలేరో వాహనం లో పోలీసులను తిప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే షాపల్లిలో మావోయిస్టుల పేరుతో వెలసిన గోడ పత్రికలు, నకిలీవని పోలీసులు గుర్తించారు. వీటిని అంటించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఇటీవలే డీజీపీ మహేందర్ రెడ్డి ములుగులో పర్యటించి మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టారు. అడవుల్లో గాలింపు ముమ్మరం చేశారు.