వైసీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టుల లేఖ.. మన్యం విడిచిపోవాలంటూ ఆదేశం! - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టుల లేఖ.. మన్యం విడిచిపోవాలంటూ ఆదేశం!

March 8, 2022

 

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది. అందులో మైనింగ్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారనీ, జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ని తరిమి కొట్టాలని సూచించారు. అలాగే, పార్టీ పదవులకు రాజీనామా చేసి మన్యం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేఖ విషయం తెలిసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆశ్చర్యపోయారు. ‘ మా ప్రాంతంలో ఎటువంటి మైనింగ్ జరగడం లేదు. ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. చదువుకున్న
వ్యక్తిగా ఉత్తరాంధ్ర పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ పనీ నేను చేయను. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మేం పోరాటాలు చేసిన వాళ్లం. ఇప్పుడు మైనింగ్ చేస్తామా? ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా. గతంలో జరిగిన అక్రమ బాక్సైట్ తవ్వకాలపై విచారించాలని ఇప్పటికే కోరడం జరిగింద’ని ఎమ్మెల్యే వివరించారు. కాగా, మావోయిస్టు పేరుతో ఈ లేఖ ఎవరు రాశారో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.