నక్సల్స్‌ను చంపి డ్యాన్స్.. ఇదేం నాగరికత! - MicTv.in - Telugu News
mictv telugu

నక్సల్స్‌ను చంపి డ్యాన్స్.. ఇదేం నాగరికత!

April 23, 2018

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో 16మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్ బూటకమా కాదా అన్నది పక్కనబెడితే మృతులు మన దేశంవాళ్లే. మన పౌరులే. అయితే ఈ సంగతి విస్మరించిన సీ60 కమాండెంట్ పోలీసులు దీన్నొక ఘనకార్యంగా భావించి డ్యాన్స్ చేశారు. డీజే పెట్టుకుని, నక్సల్స్ శవాల ముందు చిందులేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనిషిని చంపి పండగ చేసుకోవడం ఆటవికం అని ఈ డ్యాన్స్ వీడియో చూసిన జనం మండిపడుతున్నారు. సీ60 పోలీసులు గతంలోనూ ఎన్‌కౌంటర్ తర్వాత ఇలాగే డ్యాన్సులు చేశారు. కాగా, ఇన్ ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు నక్సల్స్ ను పట్టుకుని బూటకపు ఎన్ కౌంటర్లో కాల్చిచంపారని హక్కులు సంఘాలు మండిపడుతున్నాయి.