ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కాల్పులు.. ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కాల్పులు.. ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి

May 9, 2020

Maoists Gunned Down in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. శుక్రవారం రాత్రి మాన్పూర్  పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో జరిగింది.  ఈ ఘటనలో ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. 

రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందింది. వెంటనే భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడటంతో కాల్పులు చోటు  చేసుకున్నాయి. ఈ సమయంలో ఎస్.కె.శర్మ అనే ఎస్సై మావోయిస్టు కాల్పుల్లో ప్రాణాలు వదిలాడు. అదే విధంగా భద్రతా బలగాల  కాల్పుల్లో నలుగురు మవోయిస్టులు హతమయ్యారు. కాల్పులు జరిగిన సమయంలో వారు 180 మంది వరకు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు అశోక్‌, ఏరియా కమిటీ సభ్యురాలు కృష్ణ,సరిత,ప్రమీల అనే మరో ఇద్దరు సభ్యులు మరణించారని రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు. వారి నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.