మరదళ్ల, బామ్మర్థుల మజాకా.. అవాక్కయే గిఫ్ట్‌లు..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

మరదళ్ల, బామ్మర్థుల మజాకా.. అవాక్కయే గిఫ్ట్‌లు..వీడియో వైరల్

May 30, 2022

సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లిలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోలలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్‌లతో సందడి చేస్తే, మరికొన్ని వీడియోలలో పెళ్లికొచ్చిన స్నేహితులు, బంధువులు చేసిన హంగామాలు వైరల్ అవుతున్నాయి. కానీ, వీటికి భిన్నంగా ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను వీక్షిస్తున్న వారంతా పడిపడి నవ్వుకుంటున్నారు. మరదళ్ల మజాకా – బామ్మర్థుల తడఖా అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో.. ‘ఓ కొత్త జంట ఘనంగా రిసెప్షన్ వేడుకను జరుపుకుంటోంది. వేదికపైకి వధూవరులను దీవించటానికి వస్తున్న వారితో ఫోటోలు దిగుతూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతలోనే ఆ పెళ్లి కొడుకు బామ్మర్థులు, మరదళ్లు వేదికపైకి డ్యాన్సులు చేస్తూ, ఒకరి వెంట ఒకరు సరదాలు చేస్తూ, బావకి అదిరిపోయే బహుమతులు ఇస్తున్నారు. కొంతమంది మరదళ్లు టిప్పుటాపుగా రెడీ అయ్యి, కొత్త బావకు ఒక్కో మరదలు ఒక్కో స్టైల్లో బహుమతిని పట్టుకుని తెగ తిప్పుకుంటుంది.’

ఇక, ఆ మరదళ్లు, బామ్మర్థులు ఇచ్చిన బహుమతులను చూసి పెళ్లి కొడుకు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ముందుగా ఒకరు మసిబట్టను గిఫ్ట్‌గా ఇచ్చారు. మరో యువతి ఏకంగా ఇళ్లు కడిగేందుకు వాడే వైపరను గిఫ్ట్‌గా ఇచ్చింది. మరోకరు చీపురు, చెత్తచాట, రొట్టెల కర్రలతో కూడిన వంటింటి వస్తువులను గిఫ్ట్‌లుగా ఇచ్చారు. ఇక అంతే పెళ్లికి వచ్చిన అతిధులు, స్నేహితులు తెగ నవ్వుకున్నారు. కొందరు మాత్రం వింతగా చూశారు. చేసేది ఏమిలేక వరుడు సైతం ముసిముసి నవ్వులతో ఎంజాయ్ చేశాడు…