సమయానికి రాని అంబులెన్స్...నటి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సమయానికి రాని అంబులెన్స్…నటి మృతి

October 22, 2019

సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఓ నటి మరణించిన సంఘటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరిగింది. మరాఠీ నటి పూజా జుంజార్ (25) ప్రస్తుతం గర్భవతి. పురిటి నొప్పులతో ఆమె బాధపడుతుండగా, ప్రసవం కోసం ఆమెను మొదట గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. 

pooja zunzari.

అక్కడ ఆమె ఓ శిశువుకు జన్మనివ్వగా, పుట్టిన కాసేపటికే పాప తీవ్ర అనారోగ్యంతో మృత్యువాత పడింది. పూజా జుంజార్ పరిస్థితి కూడా విషమంగా మారింది. వెంటనే హింగోలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. హింగోలి ఆసుపత్రి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆమెను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఆలస్యంగా వచ్చింది. దీంతో పెద్దాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతోనే తమ బిడ్డ మరణించిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.